ఒక శనివారం ఉబుసుపోక టీవి ఆన్ చేశా. మాములుగా అయితే ఏదో ఒక సినిమా వేసుకొని చూస్తాను. ఆ రోజు నా గ్రహస్థితి బాగోలేకేమో న్యూస్ చానల్ పెట్టుకున్నాను.
అలవాటు ప్రకారం బ్రేకింగ్ న్యూస్ అంటూ ఏదో హడావుడి చేస్తున్నారు. ఈ మద్య ప్రతి చిన్న విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ గా వెయ్యడం ఫ్యాషన్ అయ్యింది. మెన్నామధ్య పంది మీద కొతి కూర్చొని తిరుగుతుందని బ్రేకింగ్ న్యూస్ గా వేశారు. నాకర్దం కాలేదు అందులో ఏమి బ్రేకింగ్ విషయం వుందో అది ఎంతవరకు జనాలకి అవసరమో..
ఇంతకీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే… “కొడల్ని వేదిస్తున్న మామ. సర్ధుకుపొమ్మన్న అత్త. సమర్దించిన భర్త.”
“అరే ఇది కుటుంబ సమస్య కదా.. టీవి వాళ్ళకి ఎలా తెలిసింది. చూడబోతే వేదింపుల కేసు లాగా వుంది. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లోనో పెద్దల సమక్షంలోనో తేల్చుకోవలసిన విషయం. టీవీ వాళ్ళు ఏమి చేస్తారు.” ఆశ్చర్య పోయాను.
“మీరు బాదితురాలు తో మాట్లాడలనుకుంటే మా టీవీ కి కాల్ చెయ్యండి. మరో 10 నిముషాల్లో సరిత (బాదితురాలు) ముందుగా మన చానల్లోనే మాట్లాడటనికి సిద్దంగా వుంది.” ఇంకో స్క్రోలింగ్.
ఇప్పుడు నాకు కొంత అర్ధమయ్యింది. ఈమే నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా టీవీ చానల్ వాళ్ళని ఆశ్రయించింది. ఎందుకు?..
వాళ్ళేమైనా ఆమె పుట్టింటివాళ్ళా?..
ఇలాంటి సమస్యలు పరిష్కరించమని మన ప్రభుత్వం నియమించిన వాళ్ళా?..
సరిత నమస్య మీద వాళ్ళకున్న ఆసక్తి ఎంత? ఎందుకు?..
నిజంగానే మెరుగైన సమాజం కోసమా?..
ఇలాంటి ప్రశ్నలు నన్ను వేదిస్తున్నంతలో..టీవీ స్క్రీన్ మీద చర్చా వేదిక సిద్దం అయ్యింది.
ఒక అమ్మాయి (బాధితురాలు) కళ్ళు మాత్రమే కనపడేలాగా ముఖానికి చున్నీ కట్టుకొని వుంది. బ్యాక్ గ్రౌండ్ లో “మగాళ్ళా? మృగాళ్ళా?” అని ఎర్రటి అక్షరాలతో రాసిన పోస్టర్.
“నమస్కారం. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ధైర్యంగా(?) ఎదుర్కొని మన చానల్ కి వచ్చి మనతో తన అనుభవాన్ని(?) పంచుకోవడానికి సిద్దంగా వున్నారు.” తనదైన దోరణిలో మొదలు పెట్టాడు టీవీ రిపోర్టర్.
“చెప్పండి సరిత గారు. మిమ్మల్ని ఏ విదంగా వేదించేవారు మీ అత్తింటివారు.”
సరిత ఆమె తన బాధలను వివరించడం మొదలు పెట్టింది.
ఇంతలో టివి స్ర్కీన్ మీద మొదలైంది ఎస్ ఎం ఎస్ రిక్వెస్ట్.
ఇదో పెద్ద వ్యాపారం. (ఎస్ ఎం ఎస్ కి 6 రూపాయిలు మాత్రమే.)
FireFox

ఇలాంటి చెత్త బ్రేకింగు న్యూసులకు, SMS పోల్స్‌కి జనం స్పందించకుండా ఉంటే సరి … tv9 వాడు వాడి మానాన వాడు బ్రేకింగ్ న్యూస్ వేసుకుని చంకలు గుద్దుకుని, గజ్జలు గోక్కుని ఊరుకుంటాడు. స్పందిస్తే ఇంకా రెచ్చిపోతాడు .
nijanga phani elanti chetta channels annintini ban cheyali ….
ASHOK…..