హైదరాబాద్ లో ఐటి అద్వానస్థితిలో ఉన్న రోజులవి.
ఒక సోమవారం. తెల్లవారింది.
బరువుగాఉన్న కళ్ళను బలవంతంగా తెరిచాను.
వీక్ ఎండ్ పార్టీ వల్ల అనుకొనేరు.అంత సీన్ లేదు. రాత్రంతా ఒకటే పీడ కలలు..
నాకు జాబ్ పొయినట్లు.. ఎవ్వరూ నాకు పని ఇవ్వనట్లు.. హై-టెక్ సిగ్నల్ దగ్గర…
అయ్యబాబోయ్ తలచుకుంటేనే నిద్ర పట్టట్లేదు.
నా పేరు బ్రహ్మానందం. ఫ్రెండ్స్ నన్ను “బ్రహ్మి” అని పిలుస్తారు.
నేను హైటెక్ సిటీలో ఒక MNC కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను.
టైం చూశాను.
7.30 అయ్యింది.
అది అక్కడే ఆగి పోతే బాగుండుననిపించింది.
గబగబా బ్రెష్ చేసుకొని, స్నానం చేసి రెడీ అవ్వసాగాను.
ఈ మధ్య వర్క్ అవర్స్ 12 అవర్స్ కి పెంచినప్పటినుండి ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు పని చెయాల్సి వస్తుంది. తలుచుకుంటెనే ఏడుపొచ్చింది.
అంతలో మొబైల్ లో మిస్సుడ్ కాల్ వచ్చింది. నేను గబగబా రూం లాక్ చేసి కిందకి దిగాను.
అది క్యాబ్ డ్రైవర్ నుండి అనుకుంటే మీరు తప్పులో తా(కా)లు వేసినట్లే.. కంపెనీ క్యాబ్ పంపించడం ఎప్పుడో మానేసింది.
అది పండుగాడి దగ్గరనుండి. “నేను బస్టాప్ లో వున్నాను. త్వరగా వచ్చేయ్” అని సిగ్నల్.
పిచ్చి కుక్క తరుముతున్నట్లు పరిగెత్తాను బస్సు మిస్ అవుతుందేమోనని….
దూరం నుండి చూస్తే అది బస్టాప్ లాగా లేదు. ఒక సంతలాగా ఉంది.
జాగ్రత్తగా గమనిస్తే అంతా మన “సామజిక వర్గం”కి చెందినవారే.. ఐటి ఉద్యొగులు..
అలవాటు ప్రకారం బస్సు.. బస్టాప్ లో కాకుండా దూరంగా ఆపాడు డ్రైవర్.
వాడికి K T (KnowledgeTransfer) ఇచ్చిన (డ్రైవింగ్ నేర్పిన) వాడిని అందరూ తిట్టుకుంటూ..బస్సులోకి తమ తమ శరీరాలని కుక్కుకొసాగారు.
ఎలగోలా నేను ఒక కాలు పెట్టుకోవడాని ప్లేస్ సంపాదించాను.
రేష్మ సినిమాకి (పేరు మార్చడం జరిగింది) ఫస్ట్ డే ఫస్ట్ షోకి ముందు సీట్ టిక్కెట్టు దొరికినంత సంతోషం వేసింది.
“మాస్టారూ.. నా చెయ్యి కనిపించడంలేదు. మీరు కాని చూసారా?” అని వినిపించడంతో కంగారుపడ్డాను.
నా రెండో కాలు కనిపించడంతో “హమ్మయ్య” అనుకొన్నాను. పండుగాడి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
షాక్ కొట్టి తీగకు వేలాడుతున్న కాకిలాగా కడ్డీని పట్టుకొని వేళ్ళాడుతున్నాడు. దీనంగా చూశాడు.
నాకు అప్పటికప్పుడు “ప్రత్యేక బస్సు” ఉద్యమం చెయ్యాలనిపించింది.
ఆఫీస్ లో నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ గుర్తుకు వచ్చి ఆ ప్రయత్నాన్ని అప్పటికి విరమించుకున్నాను.
హైటెక్ బస్టాప్ వచ్చింది. అలవాటు ప్రకారం బస్సు కొండాపూర్ లో ఆగింది.
జనాలు నా ప్రమేయం లేకుండానే నన్ను బయటకు తీసుకు వచ్చి పడేసారు.
మట్టి హుండి పగలకొట్టి తీసిన పాత పదిరూపాయల నోటులాగా తయారయ్యాను. పండుగాడి కోసం చూశాను.
పండిన మామిడికాయని గట్టిగా పిసికితే బయటపడ్డ టెంకలాగా “జర్ర్”న బయటపడ్డాడు. మమ్మల్ని విసిరేసిన బస్సు అక్కడినుండి “తుర్ర్”మంది.
షేరింగ్ ఆటొలు చుట్టూ మూగాయి.
“ఐటి పార్కుకి ఎంత?” అని అడిగాను.
“పది రూపాయలు” అన్నాడు. అప్పటికే మన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఆటోలో కుక్కుకొని ఉన్నారు.
“కిలో మీటరు దూరానికి పది రూపాయలా?”
“ఎప్పుడైనా ఆటో ఎక్కిన మొహమేనా?” అన్నట్లు చూసి “రయ్య్” మని నా మొహం మీద పొగకొట్టుకుంటూ వెళ్ళిపోయాడు.
ఎక్క్కడో కాలుతున్న వాసనొస్తుంటే పక్కకి చూశాను. పండుగాడు నా వైపు కోపంగా చూస్తున్నాడు.
వాడి పై జేబులో నుండి పది రూపాయలు తీసి కింద జేబులో వేసి కాళ్ళకి పని చెప్పాను. వాడు నా తోకయ్యాడు.
“ముష్టి మురికి అష్ట కుష్టి నికృష్ట అంక చండాల దరిద్ర…” అని పండుగాడు తిట్టుకొనే తిట్లు నాకు అస్సలు వినిపించలేదు.
అక్కడ రోడ్డ్ మీద చాలా మంది ఎదో పొగొట్టుకొన్న వాళ్ళలా వెతుకుతున్నారు. పాపం జాబ్ కోసమనుకుంటాను.
****
ఆయాసంతో వచ్చి నా డెస్క్ దగ్గర కూర్చొని గటగటా బాటిల్ నీళ్ళు తాగేశాను.
అప్పుడు గమనించాను. అక్కడ అందరి మొహాలు మా కెఫ్టేరియాలో పెట్టే చపాతీలలాగా ఉన్నాయి.
ఎవ్వరూ ఎమీ మాట్లాడుకోవడంలేదు. విషయమేంటని రమేష్ గాడిని గిల్లాను.
వాడు గాలిలో ఎవో సైగలు చేశాడు. భూమిని సూర్యుడు గుద్దుకోబొతున్నడని అర్దమయ్యింది వాడి సైగలని బట్టి.
“నీకు ఎలా తెలిసింది?” నేనూ సైగ చేశాను. వాడు మెయిల్ బాక్స్ చూపించాడు.
నేను నా మెయిల్ బాక్స్ ఒపెన్ చేశాను. నేను నా మెయిల్ బాక్స్ ఒపెన్ చేసినట్లు మాత్రమే గుర్తుంది.
రమేష్ గాడు నీళ్ళు కొట్టి లేపటంతో లేచాను.
అది “నో హైక్స్..నో బొనస్..మీ ఖర్మ.. చావండి.” అన్న మెయిల్ చూసి తిన్న షాక్ అని గుర్తుకు వచ్చింది.
మెయిల్ చదివినంత సేపూ రమేష్ గాడు నీళ్ళ బాటిల్ పట్టుకొని నా పక్కనే ఉన్నాడు.
అంత భాధలోనూ చెయ్యాల్సిన పని గుర్తుకు వచ్చి ప్రాజెక్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఎంత సేపు పని చేశానో గుర్తు లేదు.
టైం 5.30 అయ్యింది.
మొబైల్ రింగ్ అయ్యింది. “నాన్న….లిప్ట్ చేయాలా వద్దా?” అనుకుంటూనే లిప్ట్ చేశాను.
“ఒరే బ్రహ్మం..మీ అమ్మ నీ పెళ్ళి అవుతుందో లేదోనని మంచం పట్టింది రా..సాప్ట్ వేర్ వాళ్ళకి పిల్లనివ్వడం లేదని మన పేరయ్య చెప్పాడు.”
ఫోన్ టాంక్ బండ్ లో విసిరెయ్యాలన్నంత కోపం వచ్చింది. అప్పటికి ఎదో చెప్పి ఫోన్ పెట్టేశాను. కాని అది నా ఒక్కడి సమస్య కాదని తెలుసు.
మొన్నటికి మొన్న మా ఊరులో నడిచివెళ్తూ ఉంటే “బాబూ.. నీకు కూడా ఉద్యోగం ఊడిందా? ఇల్లు కూడా అమ్మేశావా?” అని అడిగాడు ఒకడు పళ్ళు కుట్టుకుంటూ…
ఎదో 30నిమిషాల టివి ప్రోగ్రంలో చూశాడంట.. ఉద్యొగాలు పొగొట్టుకున్న సాప్ట్ వేర్ వాళ్ళ ముప్పై వేల ఇళ్ళు అమ్మకానికి ఉన్నాయని.
తెలుసిన ఊరిలో మర్డర్ చెయ్యటం ఇష్టం లేక వాడిని వదిలేశాను.
మళ్ళీ పని మొదలు పెట్టాను. పండుగాడు నా దగ్గరకు వచ్చి టైం అయ్యింది అని చెప్పేంత వరకు నేను టైం చూసుకోలేదు.
9.15 అయ్యింది.
గబగబా కంప్యూటర్ లాక్ చేసి బయలుదేరాను.
మరికొన్ని దరిద్రపు సంఘటనల తర్వాత నేను ఇంట్లో వచ్చి పడ్డాను.
బయటనుండి తెచ్చుకున్న ఫుడ్ పార్సిల్ కొంచం గతికి..బెడ్ మీదకి దూకాను.
బాగా అలసి వుండటం వల్ల త్వరగా నిద్రపట్టింది.
**********
అది 2010వ సంవత్సరం.
ఒక సోమవారం. తెల్లారింది.
బరువుగా ఉన్న కళ్ళను బలవంతంగా తెరిచాను.
వీక్ ఎండ్ పార్టీ లో లేట్ అవ్వడం వల్ల కళ్ళు ఇంకా నిద్రకావాలంటున్నాయ్.
టైం చూశాను.
9.00 అయ్యింది.
బద్దకంగా లేచి రెడీ అవ్వసాగాను. వీక్ ఎండ్ కొన్న లివిస్ షర్ట్, స్పైకర్ జీన్స్ వేసుకొన్నాను.
మొబైల్ మీద మిస్సుడ్ కాల్ వచ్చింది. అది క్యాబ్ డ్రైవర్ నుండి అని తెలుసు కాబట్టి లైట్ తీసుకున్నాను.
ఒక అర గంట తర్వాత మెల్లగా క్యాబ్ లోకి ఎక్కాను.
నా మెయిల్ బాక్స్ లో నిండిన ‘తెలుగు మ్యార్టిమోని.కాం’ నుండి వచ్చిన అమ్మాయిలను తలుచుకొంటుంటే, క్యాబ్ హైటెక్ సిటీ వైపు పరిగెత్తింది.

(ఇప్పుడే మొదలైంది.)
“రెసిషన్ కుక్క కరిసి, కష్టాలతో కాపురం చేస్తున్న నా సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు ఈ నా కధ అంకితం.”
FireFox

సున్నితంగా ఇరగదిస్తున్నావు బాస్ .. keep rocking the same way !
Thanks annayaa.
Mana anadari lonu oka Brahmi unnadu….emantav…My dear young man…. (Adavi Ramudu lo Jaggayya mana Sr. NTR ni ila pilichadu)….
inthaki brahmi ki pellaindantaava ?
kummesaavu guru. chala baaga raasaav.
Recession rocking…
మీ శైలి చాలా హాస్య స్ఫోరకంగా ఉండి, చదువుతున్నంత సేపు పొట్ట చెక్కలయింది.
చివరలో ఆశావాదంతో ముగించడం _ మీలోని కథకుని పరిణతిని తెలియజేస్తుంది.
అనేకానేక అభినందనలు
ధన్యవాదములు
Hi..Phani..
Iragatheestunnav… Inthaku ee vooru manathi..
Keep rocking man…nijangaa chaala relaxing gaa vundi nee blog chathuvuthuu vunte..
Keep blogging man…
Thanks. I am from Ongole…
Anna keka ne, chaala happy ga undi nee blog chaduvuthunte.
Thanks anna……..
Super Masteru meeru… Keep it up
super guru…kaani intha advannanga undhantava paristhiti?? mari konchem ekkuvaindemo….kaani indiloni hasyam matram keka bossu…
తరై నా తరై………….. అబ్బాయీ మరి కథ మంచిగుంది గాని మన పండు గాడి పని ఏమైనది
పండు గాడు , గుండుగాడు ఎవడైనా ఐటి బూంలో ఉంటే సేల్ అయిపొతారు.
సామాజిక వర్గనికి కొత్త అర్ధం చెప్పారు.
good one
…సామాజిక వర్గనికి కొత్త అర్ధం చెప్పారు….
Keka
Adirinadi
Nenu USA Bench meeda vunna ayina
baga navvu vachhinadi
kaka very good chala baga rasavu kaka pothe memu software empolyees kadu marketing poragalamu ma medha kuda oka chini chilipi kavitha rayochu kada kaka memu ma medha vesina jokes ki hayiga kadupu chekkalayetatu navvukuntamu
see u kaka bye
బాగుంది
Nice article
too good
keka puttinchavu ga….intaki peraiya cheppina trend emaina marinda…
adey annayya s/w vaallaki pillani iche vishayam… lol
)
babai………. story mathram keka……. keep rocking
Super Annai, Manchi hasyanni pandichav.
Keep smiling:)
keka keka keka
Veedu samaanyudu kadu…. abbabbabba…. kadupu chekkalaindi… kaneesam oka 150 mandiki forward chesanu… after all I care for them… they should njoy it…
chala bagundi
:)
Excellent. Thanks for sharing Brahmam.. office lo chadhuvukunna, gettiga navvalekapoyanu.. adhae mana Brahmanandham chesthae, nenu office ani kuda choodanu..
I am also sharing with my friends for many more laughs…
Viraga theesav kaani one important message is that we will need to convey to Gen Y people I want to add here. Do not ever never bank on one skill develop distinct versatile skills to mitigate these kind of risks. Life full will not be smooth sail. Gear up to conquer the bumps too.
it is very nice.. gud composition..
Bosu,Iragadeesav ..
super ga cheppav mana kastalani
Boss….You rock Phani…Too good….Keep writing
Navvu aapukoleka poyanu Phani…
Superb comedy…..