ఒక రాజు – నలుగురు కొడుకులు

ఒక రాజుకి నలుగురు కొడుకులు. ఒకసారి రాజుకి జ్వరం వచ్హింది.
స్వెన్ ఫ్లూ ఏమోనని రాజ వైద్యుడు వచ్చి పరిక్షించి చూసి జ్వరానికి కారణం వీపు మీద లేచిన పుండు అని తేల్చి చెప్పాడు.
“ఇక్కడికి ఈశాన్యంగా ముప్పై క్రొసుల దూరంలొ వున్న కొండ మీద వున్న చెట్టు తొర్రలొ వున్న పిట్ట వేసిన రెట్ట తెస్తే, మందు చేసి పూస్తే, అప్పుడు తగ్గుతుంది.” అని పెట్టె మూసుకొని వెళ్ళిపొయాడు.

ముసలోడు (రాజు) తన కొడుకులను పిలిచి,
“నాయనలారా!”
“ముసలొడు మనకి ఎదో పెట్టాడు” మనస్సులో అనుకొని, పైకి
“తండ్రీ”
“నాకు ఈ జ్వరం తగ్గాలంటె మీరు నా కొసం ఒక సాహసం చెయ్యాలి” అని రాజవైద్యుడు చెప్పినది చెప్పాడు.
“సరే” అని మొదటి కొడుకు (వీడి పేరు అనవసరం) బయలుదేరాడు.
వెళ్ళినవాడు వెళ్ళినట్టే వున్నాడు. వాడి జాడ లేదు.

“సరే” అని రెండవ కొడుకు (వీడి పేరు కూడా అనవసరం) బయలుదేరాడు.
వీడి జాడ కూడా లేదు.

“సరే” అని మూడవ కొడుకు (వీడి పేరు మనకి అస్సలు అవసరం లేదు) బయలుదేరాడు.
వీడి జాడ కూడా లేదు.
“తండ్రీ నేను ఆరు నూరైనా …నూరు ఆరైనా.. మందు తీసుకొని వస్తాను.” అన్నాడు విజయుడు (వీడె మన హీరొ. అందుకే పేరు పెట్టా…).

మందు అనే పదం వినగానే రాజుకి నోట్లో నీళ్ళు కారాయ్. సారీ! వూరాయ్.  

McDowells ని వూహించుకుంటూ విజయుడిని ఆశీర్వదించాడు.

ఒక మంచి తెల్ల గుర్రం మీద వారానికి సరిపడా ఆహారం తీసుకొని ఉత్తర దిక్కుగా వెళ్ళసాగాడు.

ఈశాన్యం వెళ్ళమంటె.. ఉత్తరంగా వెళ్ళుతున్నాడు ఎమిటా అనుకుంతున్నారా?

మన హీరొ కొంచం తేడాగాడు. వెరైటికి ప్రాణం ఇస్తాడు. పూరి జగన్నాథ్ హీరొ లాగ అన్న మాట. ఉత్తరంగా వెళ్ళినా ఈశాన్యం వస్తుందని వీడి వెదవ ఆలోచన.

అలా కొంత దూరం పొయేసరికి విజయుడికి మంచినీళ్ళు దాహం వేసింది.
(మంచి నీళ్ళు కాక వేరే దాహం కూడ వేస్తుందా? వీడు కొంచం తేడా కదా.. అప్పుడప్పుడు వేరే దాహం కూడా వేస్తుందిలే వీడికి..)

నీళ్ళకోసం వెతుకుతున్న విజయుడికి, దూరంగా నీళ్ళు పారుతున్న శబ్దం వినిపించింది. వేగంగా గుర్రాన్ని అటు వేపు పరిగెత్తించాడు.
అతనికి పెద్ద జలపాతం కనిపించే సరికి ఆనందంతో, గుర్రాన్ని అక్కడే వున్న చెట్టుకి కట్టి, జలపాతం లోకి దిగాడు.

కడుపునిండా నీళ్ళు త్రాగి బయటికి వస్తున్న విజయుడి కాలుకి ఎదొ చుట్టుకొని బలంగా లొపలికి లాక్కొని వెళ్ళింది.
పూర్తిగా నీళ్ళల్లొ మునిగిన విజయుడు దాన్ని ఎక్కడో చూసినట్లుందని ఆలోచించి, “ఆనకొండ” అని పెద్దగా అరిచాడు.
      (ఈ మధ్యనే జెమిని లొ తెలుగు లొ చూసాడు)

నీళ్ళల్లొ వున్న విజయుడు చొక్కా చించుకొని దానితొ పోరాటానికి దిగాడు.
(ఆరు పెట్టెల బాడి చూసి అనకొండ పారి పొతుందేమోనని   )
దాన్ని చంపటం ముందే చూసి వుండటం వల్ల,”జై జెమిని” అనుకొని వీజీగా చంపేసాడు.

వెంటనే బయటకు వచ్హి, నీళ్ళలోకి చూడసాగాడు.
(చచ్హిన అనకొండలో నుండి దేవత వచ్హి “ఎమి కావాలో కొరుకో!” అంటే ఏమి కోరుకోవలో అని ఆలొచించసాగాడు.)
ఎంతసేపటికీ రాకపొయేసరికి, నిరాశగా గుర్రం దగ్గరకు వెళ్ళాడు.

అప్పుడు గమనించాడు తన వంటి మీద అక్కడక్కడ గాయాలనుండి రక్తం వస్తుంది.
మా టివిలో చూసిన “ప్రకృతి వైద్యం” గుర్తుకు వచ్హి, కావలసిన మొక్కలు వెతకసాగాడు.
ఒక మొక్కని చూసి అతని కళ్ళు ఆనందంతో మెరిసినయ్.

దాని మొదట్లో పట్టుకొని బలంగా లాగాడు.
అంతే, ఒక పెద్ద మెరుపు,(మెరుపుతో పాటు శబ్దం కూడా వస్తుంది కదా. అందుకనే ప్రత్యేకంగా రాయలేదు. ఇంకు దండగని…)
వీటన్నింటితో పాటు దేవత కూడా ప్రత్యక్షమయ్యింది.

చొక్కా లేకుండా ఆరు పెట్టెల బాడీ తో వున్న విజయుడిని చూసి,
“నాయనా! శరీరమంతా సొట్టలతో, చొక్కా కూడ లేకుండా, పిచ్చి మొక్కలు పీక్కుంటూ తిరుగుతున్నవు. నేను నీకు ఏమినా సహయం చేయగలనా?” అని అడిగింది.

ఆశ్చర్యం తో కూడిన ఆనందం వల్ల వచిన సిగ్గుతో విజయుడు మెలికలు తిరగసాగాడు.
“విషయం చెప్పు.” మళ్ళీ ఆమే అడిగింది.
విజయుడు జరిగినదంతా డైలీ సీరియల్ లాగా కాకుండా టి20 లాగా చెప్పేసాడు.

“నన్ను ఆ చెట్టు దగ్గరకు చేర్చగలవా?” అని అడిగాడు.
“చెట్టు దగ్గరకు ఎంటిరా పిచ్చి వెదవా? ఆ పిట్ట రెట్టని కూడా తెచ్హి ఇవ్వగలను. నీ బుర్ర ఇంత వరకే పని చెస్తుంది.” అని మన్సులొ అనుకొని,
“తధాస్తు.” అని మాయమయ్యింది.

తన తెలివితేటలకి లోపల లోపలనే మురిసి పోతూ వుండగానే అక్కడ మాయమైన విజయుడు చెట్టు తొర్ర దగ్గర వున్నాడు.
వెంటనే ఏమీ ఆలోచించ కుండా తొర్రలో చెయ్యి పెట్టాడు పిట్ట కోసం. ఏదో కుట్టినట్లనిపిస్తే అంతే వేగంగా చెయ్యి వెనక్కు తీసుకున్నాడు.
బాధగా దిక్కులు చూస్తున్న అతనికి చెట్టు మీద చెక్కిన అక్షరాలు కనిపించాయి.
“ఈ చెట్టు తొర్రలొ వున్న పిట్ట పక్క సందులొ కొండ మీద వున్న చెట్టు తొర్రలోకి మారినది.”

కోపంతో విజయుడు పక్కనున్న కొండమీదకి ఎక్కసాగాడు.
అదే సమయంలో కొండ పళ్ళు ఏరుకుంటున్న కొండ రాజు కూతురు ‘ బండ రాణి ‘ విజయుడిని చూసింది.
ఆరు పెట్టెల బాడీ, చిరిగిన, రంగు పోయిన, ఒక బట్టన్ వూడిపోయిన జీన్స్ (Levis 501 series) వేసుకొన్న కొండగాడిని విజయుడిని ఇష్టపడింది.

ఒక కొండ పండుని తీసుకొని అతనిపై మెల్లగా విసిరింది. అది విజయుడికి బలంగా తగిలింది.
అసలే అనకొండ కొరికి, చెట్లు గీరి, ఏదో కుట్టి, ఈకలు పీకిన కోడి లాగా వున్న విజయుడికి చిర్రెత్తుకొచ్హింది.
కొండరాణిని చూసి “ఒసే బండదానా!” అని అరిచాడు.
తన పేరు ఎలా తెలిసిందో అని అశ్చర్యంతో కూడిన ఆనందం వల్ల వచ్హిన సిగ్గుతో చెట్టు చాటుకు పరిగెత్తింది.

ఒక్కసారిగా భూమి కంపించినట్లయింది. విజయుడు పడబొయి, పక్కనే వున్న చెట్టుని పట్టుకొని నిల్చున్నాడు.
“సిగ్గు పడింది చాలుగాని బయటకు రా!” అన్నాడు.
సిగ్గు పడుతూనే బయటకు వచ్హింది. విజయుడు ఇంక పట్టుకున్న చెట్టుని వదల్లేదు ఎందుకేనా మంచిదని. 

“నీకు ఎమి కావాలి? ఇక్కడకు ఎందుకు వచ్చావ్?” అని అడిగింది ఒక మెలిక వేస్తూ.
కావలసింది ఇది అని చెప్పాడు.
(పిట్ట రెట్ట కావలని అడిగితే బాగొదేమోనని, పిట్ట కావలని చెప్పాడు. పిట్టని కొట్టి దాని రెట్ట తీయ్యచ్చని వీడి వెదవ ఆలొచన. కొంచం తేడాగాడు కదా)

అంతలొ నెత్తిన 1..2…3..50 పిడుగులు పడినట్లనిపించింది.
కళ్ళు తిరిగినయ్. తల చుట్టూ పిట్టలు తిరిగినయ్.

విజయుడి నెత్తి మీద గుద్దిన బండరాణి అమాయకంగా, “ఈ పిట్టల్లో నీకు కావలసిన దాన్ని పట్టుకో” అంది.
పిడుగు ఎటు నుండి పడిందా అని దిక్కులు చూస్తున్న విజయుడికి పిడుగుకి కారణం తెలిసింది.
వచ్చిన కోపం మింగి (వీడి అవసరం కదా..), “నాకు చెట్టు తొర్రలొ వున్న పిట్ట కావాలి.” అని అడిగాడు.

“అమ్మో ఆ పిట్టా! అది చాలా చెడ్డది. ఇంతకముందు దాని కోసం వచ్చిన వాల్లని ఏమి చెసిందో చూడు.” అని పక్కనే పడి వున్న మూడు అస్ఠిపంజరాలను చూపించింది.
పుర్రె (తలకాయ) లేని అస్ఠిపంజరాలను తన అన్నలుగా గుర్తించాడు విజయుడు.

“కాని నన్ను పెళ్ళి చెసుకుంటానంటే నీకు సహాయం చెస్తాను.” మళ్ళీ తనే అనింది.

“ఈ బండదాన్ని చేసుకోక తప్పేటట్లు లేదు” అనుకొని “సరే” అన్నాడు.

వెంటనే బండరాణి ఒక కొండ అరుపు అరిచింది.
ముందు పడిన పిడుగు కంటే దారుణంగా ఉంది ఆ అరుపు. చెవులో నుండి కారుతున్న రక్తం తుడుచుకుంటూ, ఏమి జరుగుతుందోనని చూడసాగాడు.
తొర్రలో నుండి పిట్ట బయటకి వచ్చి ఎదురుగా వున్న బండరాణిని చూసి,
“అనుకున్నా, అరిచింది ఈ బండదేనని.. దీని $!@%@$*$%్@$@”, అని లోపల తిట్టుకొని
“చెప్పండి మహారాణి” అని పిట్ట భాషలొ అంది.
(మీకు అర్ధం కావడానికి తెలుగులొ రాయటం జరిగినది)

విషయం చెప్పింది బండరాణి కొండభాషలొ.
వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ భాషలలో ఏదో మాట్లాడుకున్నారు.. పొడుచుకున్నారు..
విజయుడు ఓపికగా వింటున్నాడు. (వీడి అవసరం కదా..)
చివరికి పిట్ట వెళ్ళడానికి ఒప్పుకుంది.
తిక్క పెళ్ళి కుదిరిన విజయుడు బండరాణిని, పిట్టని తీసుకొని రాజ్యానికి బయలుదేరాడు (ఏనుగు ఎక్కి).

“హమ్మయ్య” అనుకొన్న తెల్ల గుర్రం మన్స్సులోనే కృతజ్ణతలు చెప్పుకొంది విజయుడికి.

*****

దూరం నుండే రాజ భటులు విజయుడిని గుర్తుపట్టి పరిగెత్తి వచ్చారు.
గుర్రంతో వెళ్ళి ఏనుగు (బండరాణి) తో వచ్చిన యువరాజుని స్వాగత సత్కారాలతో ఆహ్వానించారు.

రాజ వేద్యుడు పిట్ట రెట్టతో మందు చేసి రాజుకు పూయడం, అది వికటించి రాజు చచ్చి పొవటం, విజయుడు రాజు కావడం వెంట వెంటనే జరిగి పొయాయి.
విజయుడు – బండరాణి – ఒక పిట్ట… శుభం.

viJayudu banda raani   pitta

(అయిపొయింది.)

“చెత్త కధలతో, అర్ధం పర్ధం లేని సీన్స్ తో ప్రేక్షకులను హింసిస్తున్న సినిమా రచయితలు, దర్శకులకు ఈ కధ అంకితం.”

 

ప్రచురితం: on జూన్ 25, 2009 at 3:39 అపరాహ్నం  వ్యాఖ్యలు (18)  

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://indralokam.wordpress.com/2009/06/25/%e0%b0%92%e0%b0%95-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b1%81-%e0%b0%a8%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b1%81-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a1%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

అభిప్రాయములు మీ ఉద్దేశ్యం…

  1. modern raju kadha chala bagundhi

  2. vijayudu vijayam sadistada? Vijayuduki bandadi mandu istunda?vijayudi sodarulu emi chestunnaru…?

    Ivanni telusukovalante repati sanchika kosam vechi chudandi..

    chaduvuthu undandi…Indralokam….

  3. LoL, good one! When & what is next? Way to go!

  4. బాగా వ్రాశారు..అయితే వున్న ఆ ఒకటీ అరా టైపో లు లేకుంటే ఇంకా బాగుంటుంది..గమనించగలరు..

    • ధన్యవాదములు. నేను తెలుగులో మొదటిసారిగా లెఖిని వాడి వ్రాస్తున్నను. అందుకే కొంచం తడబడ్డాను.

  5. different one!

    • Kadha Kottagaa , Saradaga undi. Good Luck!

      • ధన్యవాదములు

  6. Good one. Hasyam baagundi mastaru. :-)

  7. చాలా బాగుంది….simply hilarious..expecting more ….

  8. Mama…

    Simply sooperb… Anthuke naa blog lo (http://reddypidugu.blogspot.com) oka post nee blog gurinchi raayakunda vundalekah pothunnanu… Superb comedy…

  9. 10/10

    waiting for part 2

  10. very nice story

  11. SUPER ANNYA

  12. ee katha maa sunday andra jyothi lo vesukune permission ivvagalara sir?
    - gorusu

    • vesukondi. mari naa peru veyadam marchipokandi..

  13. Sooper Annaya…… chala bagundi :)


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.