నువ్వంటే నాకిష్టం (చంపేంత..)

“యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః”

నేను చిన్నప్పుడు చదువుకున్న శ్లోకాలలో బాగా గుర్తున్నది.

“ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు.” అని దాని అర్ధం.

“స్త్రీ” ఈ పదానికి లొకంలో ఎన్నో రూపాలున్నాయి. ప్రపంచమంతా నిండిన అందమైన ప్రకృతిని మనం ‘ స్త్రీ ‘ రూపంగానే భావిస్తాము.

తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా, ప్రేయసిగా, స్నేహితురాలిగా .. ఇలా ఎన్నో రూపాల్లో మన జీవితాన్ని అనందమయం చేయడానికి మన మధ్య చేయబడిన ఒక అందమైన సృష్టి. ఈ విషయాన్ని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. సినిమాల్లో చూపించారు.

అందమైన ఈ సమాజంలో ఒక వ్యక్తిగా , ఒక ప్రేక్షకుడిగా నేను చాలా అనందించాను. చప్పట్లు కొట్టాను.

నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన నన్ను ఎంతో ఆలొచింపజేసింది.

ఒక రోజు నేను నా ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనానికి కాలేజి నుండి ఇంటికి బయలు దేరాము.

సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది మా ఇల్లు. ఈ మద్యలో కొన్ని ఇంటర్మీడియట్ కాలేజీలున్నాయి.

రోడ్డంతా కాలేజీ పిల్లలతో సందడిగా ఉంది.

అంతలో ప్రకృతి తనకు అన్యాయం జరిగిందన్నట్టు రోదించటం మొదలు పెట్టింది.

పిల్లలందరూ పుస్తకాలను నెత్తిన పెట్టుకొని వర్షానికి అందకుండా తప్పించు కోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అలావస్తున్న మాకు దూరం నుండి గుంపుగా జనం కనిపించారు. పొలీసులు కూడా వున్నారు ఆ గుంపులో.

మేము కూడా అటు వైపు పరిగెత్తాము.

“ఒక అమ్మాయిని ఎవడో కుర్రాడు నరికి వేసాడంట. అమ్మాయిని హస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు. కాని ఆ అమ్మాయి బ్రతకటం మాత్రం చాలా కష్టం.”

ఇలా మాట్లాడుకుంటున్నారు అక్కడ ఆ సంఘటనని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు.

వర్షానికి కారణం అప్పుడు తెలిసింది నాకు.

ఇంత జరిగినా తనకి ఏమి జరగ లేదంటూ…జరిగిన దారుణానికి గుర్తుగా అక్కడ పడిన రక్తాన్ని గబగబా వర్షంతో కడిగే ప్రయత్నం చేస్తుంది.

మేము అక్కడ నుండి బయలుదేరాము. మునుపటి ఉత్సాహం ఇప్పుడు మాలో లేదు.

ఆ రోజు సాయంత్రం మా అత్త కొడుకు చెప్పాడు అసలు జరిగిన విషయం.ఆ అమ్మాయిని చంపిన కుర్రాడు, మా వాడు చదువుతున్న కాలేజిలోనే చదువుతున్నాడు.

ఆ కుర్రాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు. కాని ఆమె ఒప్పుకోలేదు. ఆ రోజు కాలేజినుండి వస్తున్న ఆమెని వాడు నిలదీశాడు. కాదనటంతో ముందుగానే తెచ్చుకున్న కత్తితో చంపేశాడు. కత్తిని వర్షంలో కడిగి, అక్కడనే కాలవలో పడవేసి నింపాదిగా క్లాస్ కి వెళ్ళి కూర్చొన్నాడు.

ఇదేదో ఆవేశంలో చేసింది కాదు అని నాకు అర్ధం అయ్యింది. వాడు ఆ ఆమ్మాయిని చంపాలనే కత్తి తీసుకొని వచ్చాడు.

ఒక మనిషిని చంపడం ఎంత దారుణమో…చంపాలన్న ఆలోచన ఇంకా దుర్మార్గమైనది.

అప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చాలా జరిగుండవచ్చు. కాని నా కళ్ళముందు, నా పరిదిలో జరగడంతో ఈ సంఘటన నాలో ఇంతగా ఉండిపొయింది.

మరి కొన్నాళ్ళకు ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది.

ఒక కుర్రాడు క్లాస్ రూంలో ఎగ్జాం రాస్తున్న అమ్మాయిని, తనను ప్రేమించలేదన్న కారణంతో నరికి చంపాడు.

రాష్టమంతా ఒక సంచలన వార్త అయ్యింది. అన్ని న్యూస్ చానల్స్ కి ఫుల్ టైం కవరేజ్ దొరికింది.

ఇక్కడ నాకు ఎంత ఆలోచించినా అర్ధం కాని విషయం ఒకటుంది.

ఎదైనా ఒక విషయాన్ని మనం ఇష్టపడితే “చచ్చేంత ఇష్టం” అంటాం కాని “చంపేంత ఇష్టం” అనం.

కాని వీళ్ళ విషయంలో “చంపేంత ఇష్టం” ఎందుకు అయ్యింది?

దానికి కారణం పెరిగిన వాతావరణమా? చదివిన స్కూలా? ఇంట్లో పరిస్థితులా? ఫ్రెండ్సా? సినిమాలా? న్యూస్ చానల్సా?

మనం కూడా ఈ సమాజంలోనే ఉన్నాము. సమస్యలతో కూడిన కుటుంబ జీవనం మనలో చాలా మందికి ఉంది. సినిమాలు మనమూ చూస్తున్నాము. ఇవన్నీ పైన చెప్పిన వాళ్ళని మాత్రమే ప్రభావితం చేశాయా?

నాదగ్గర సమాధానం లేదు.

కాని ఒక్కటి మాత్రం నిజం “ఎక్కడ మనుషులు నివసిస్తారో అక్కడ మాత్రమే స్త్రీలు గౌరవించబడతారు.”

ప్రచురితం: on జూన్ 12, 2009 at 8:24 పూర్వాహ్నం  వ్యాఖ్యలు (13)  

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://indralokam.wordpress.com/2009/06/12/%e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%a8%e0%b0%be%e0%b0%95%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%82-%e0%b0%9a%e0%b0%82%e0%b0%aa%e0%b1%87%e0%b0%82/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

అభిప్రాయములు మీ ఉద్దేశ్యం…

  1. i knoe the answer for this….
    life lo complete ga anni factors valla bad ga influence ayyina vade ala chesthadu, bathakatam chetha kani vadu…thr is no big difference between him nd a wild animal.
    and cming to the reasons(factors) which made him like a animal..
    dhiniki oka factor antu complete ga emi undadhu…

    ee society lo prathi okkadu edho oka factor tho influence avuthadu..bcos nobody here is a complete man.. ala inflence avvatam lo threshold limit okati untundhi (may be 2-3 factors valla influence avvatam valla migatha manchi vishyalu vatiki negate chesi manalini control lo unchutayi)

    but veedu(this animal).. anni factors tho influence ayyadu.
    1. perigina environment ( veedu values leni community nunchi vachi vuntadu)
    2.school( asalu veedu school ki chakka poyi undadu)
    3.gali frnds
    4. pcihi cinimalu
    5.news channels lo crimewatch

    ela prathi karanam chetha complete ga influence avvatam valla vedu slow ga manshi nunchi mrugam laga change avi ani pani chesadu..

  2. ఈ సందర్బంలో ఒక ప్రముఖ హీరో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
    “నేను అమ్మాయికి గులాబి ఇచ్చి ఐ లవ్ యు చెప్తే ఎవరూ చూడరు. అదే పైన గులాబి ఇస్తూ కింద తుపాకి పెడితే అది వంద రోజుల సినిమా అవుతుంది.”

  3. రకరకాల కారణాలు. నేటి సమాజంలో పెరిగిపోతున్న పోటీతత్వమూ ఒక కారణం. దాని గురించి వివరంగా ఇక్కడ రాశాను అప్పుడెప్పుడో. చూడండి.

    • చూశాను. ఆలోచించదగిన విషయము. ధన్యవాదములు.

  4. —”ఎదైనా ఒక విషయాన్ని మనం ఇష్టపడితే “చచ్చేంత ఇష్టం” అంటాం కాని “చంపేంత ఇష్టం” అనం.

    కాని వీళ్ళ విషయంలో “చంపేంత ఇష్టం” ఎందుకు అయ్యింది?”—

    EXCELLENT question with perfect words !

  5. idi chaala daraunam

  6. rei,
    ee madhya tv lo vache lo seriols baha choosthunnavanukuntanu kadhalo manchi depth petti vrasav. kadha chadivina valla notolonunuchi gonthulo nunchi gundellonunchi kadupuloki velli akkada touch chesav.

    bagundi keep it up

  7. Thanks for showing agony on women.In this world good/bad for a women happens with guys only.If guys really feel women is a part of nature’s beauty they will obviously protect them.

    • dear you are right…we should protect women.. but when women is not ready to get protected and want to be like a man..behaving like a man..competing with man ( not in education, and jobs i mean here ) who can save you? good/bad for a women happens with guys” i m not agree with u coz there are girls ( mayaladies) who are playing with innocent males in the world in india as well. u said” women is nature’s beauty” u r right but if it is ” natural” then it will defenetely b protected we like original or natural charminar or tajmahal not the artificial ones..now women became ( not all but most of) became unnatural..so….???? well, it is not an argument but a clarification.. god bless us all

  8. hmmmm…. nice question man…..

  9. ‘Brahmi S/w..’ lo anta ga navvinchina kurradena… gundelni pinde sannivesanni varnisthu nannu intaga prabhavitam chestundi… Hats off too you Phani. Samajam meeda… samasyala meeda neekunna lotaina avagaahanaku Vandanalu.

  10. andaru ammaila tarupu vadinche valle…neno chinna story cheptanu note cheskondi….nijam telsukondi… okadu oka ammaini chalaaaaaaaaaaa preminchadu 8 years…..gadhamgaaa ento istaam gaa inti varikante ekkuvagaa tanu ista pade chellai kanna ekkuvagaaaa tanato ne jivitam anukunnadu kalalu kannadu tana kosam chala marchukunnadu… ento preminchadu sinamalalo chupinchina dani kante ekkuvagaaa….kani vedikante andagadu sampannudu ragane 8 yrs premani kadani tanu vadito colse indi veedni lite teesukundi…endenti ? ani adigitee nalife na istam andi … ante sairpoyede!!! mandu kottukuntu bratikese vadu..kani nuvvevaru adagataniki andi? tana munde vadito jokes kissess kavalani ..vaadiki tikka regindi…kattiki pani cheppadu…….next day news ” maro premonmadi chetilo abala bali” SO…WHO HAVE TO CHANGE? MEN ? WOMEN? MEDIA? OR I?

  11. Problem manalo mana society lo undi..mana system lo undi….chachentha isthtapade rojulu poyayi…champentha matrame migilindi…..infact premaki artham maripoi chala samvastharalaindi.
    ee generation lo vallaki….prema ante oka fashion…boy fnrd /girl frnd undatam oka prestigious symbol matrame….time pass ki love cheyyatam….ooru meeda padi thiragatam… aa tarvtha edo oka godava…dantho ammaini aa abbai champeyatam….ala ani abbailadi matram tappu…ammailu antha correct ani nenu ananu…. i still remember…..prema veru…aakarshana veru ani ma mom cheppina matalu…..YES….it’s not same…..LOVE cheyyataniki oka maturity kavali…asalu love ante enti ani teliyali, aa maturity lekunda puttedi infatuation. adem lekunda…love love ani edo time pass kosam thirigithe ilane untundi……ala valueless ga undatam vallane ee champukovatam…narukkovatam…
    chalamandi even pelli chesukoni 10years kalisi undi kooda, kalisi brathakaleka vidipothunnaru and aa tarvatha evari life valladi…champukovalanukunte vallu kooda champukovachu, may be age valla vallakochina maturity valla, they understand the reality…….
    paina konthamandi….why protect only women…why not men annattuga matladaru….. maybe this might convince them…
    meeru adigina question mee situation ki matrame sambandinchindi…..kani women ni protect cheyyalanedi…oka society ki sambandinchindi…..!!!! abbai ammaini champadu ani meeru 100 chusthe aa 100 ammailaki inka life ledu..….ammai abbai ni cheat chesindi ani 4-5 chustharemo….cheat cheyyataniki…valla reasons vallaki undochu….kani pranalu teeyaleduga??inka aa abbai life aa abbai brathike avakasham undi kada…?? Enduku adi artham chesukoru???? Ayina okari life ni ardhantharanga end chese right vallaki evadichadu????


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.